ఆ రెండు గ్రామాల రైతులు ఆమోదం

by  |
ఆ రెండు గ్రామాల రైతులు ఆమోదం
X

దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నియంత్రిత పంటల సాగు’కు మేము సైతం అంటూ రెండు గ్రామాల రైతులు ఏకగ్రీవంగా అమోదించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని పెద్దకోడూరు, మచాపూర్ గ్రామాల రైతులు సోమవారం గ్రామ సభలను ఏర్పాటు చేసుకుని నియంత్రిత పంటల సాగుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈమేరకు తీర్మాన పత్రాన్ని చిన్నకోడురూ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రాజు కావాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల సాగును ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రైతులందరూ పత్తి, కంది, సన్నరకం వరిని సాగు చేసి అధిక దిగుబడులు సాధించి, మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధును ఆపివేయడానికే నియంత్రిత పంటల సాగు అనే పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారని, కానీ వారి మాటలను రైతులు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ లింగం, బాబు, ఎంపీటీసీలు సాయన్న, జమున, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed