టైగర్ అవార్డు విన్నర్ ‘పెబుల్స్’

by  |
టైగర్ అవార్డు విన్నర్ ‘పెబుల్స్’
X

దిశ, సినిమా: కోలీవుడ్ ఫిల్మ్ ‘పెబుల్స్ (కూజంగల్)’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రొట్టర్‌డామ్ టైగర్ కాంపిటీషన్‌లో ప్రతిష్టాత్మక సినిమాలకు సైతం గట్టి పోటీనిచ్చి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో టైగర్ అవార్డు అందుకున్న రెండో భారతీయ చలనచిత్రం, తొలి తమిళ చిత్రంగా రికార్డు సొంతం చేసుకుంది. పీఎస్ వినోద్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘పెబుల్స్’ చాలా సరళమైన, వినయపూర్వకమైన చిత్రమని.. వెంటనే సినిమాతో ప్రేమలో పడిపోయామని కాంప్లిమెంట్స్ ఇచ్చారు జ్యూరీ మెంబర్స్.

సింపుల్ అండ్ హంబుల్ ఫిల్మ్ ‘పెబుల్స్’ చిత్రీకరణ తమిళనాడులోని ఓ మారుమూల పల్లె ప్రాంతాల్లో జరగ్గా.. డైరెక్టర్ వినియోగించిన కెమెరా విధానంపై ప్రశంసలు అందాయి. మద్యానికి బానిసైన వ్యక్తి పెట్టే హింస భరించలేక పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చే క్రమంలో.. స్కూల్‌లో ఉన్న కొడుకును కూడా తనతో తీసుకువెళ్లడం.. ఈ జర్నీలో చోటుచేసుకునే సంఘటనల ద్వారానే ఆ ప్రాంతం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉంది? ప్రజలు ఎలాంటి జీవనం గడుపుతున్నారు అనేది చూపించాడు డైరెక్టర్. సినిమాకు మెయిన్ సోల్ ఆ పిల్లాడు కాగా.. చిత్రాన్ని డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార నిర్మించారు. ఇక యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి.



Next Story

Most Viewed