మచ్చ లేని నాయకుడు.. ‘సోనియా’ను ఒప్పించిన ఘనత కూడా ఆయనదే!

by  |
revanth-reddy-and-jaipal
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్​రెడ్డి పాత్ర చాలా కీలకమైందని, సోనియాను ఒప్పించిన ఘనత ఆయనదేనని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. జైపాల్​రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలను ఆచరించి అభివృద్ది చేయాలన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్​రోడ్‌లో జైపాల్​రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలోనూ కీలకంగా వ్యవహరించారని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే చేయించి పాలమూరు సస్యశ్యామలం అయ్యేందుకు పునాదులు వేశారన్నారు.

కేంద్ర పెట్రోలియం మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసినప్పుడు రాష్ట్రానికి మేలు చేశారని, హైదరాబాద్‌కు మెట్రో రైలు రావడానికి ప్రధాన కారణం జైపాల్​రెడ్డి కృషి మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్​ చరిత్రలో పీవీ నర్సింహారావు తర్వాత గుర్తు చేసుకోవాల్సిన మహానీయుడు జైపాల్​రెడ్డి అని అన్నారు. రాజకీయాల్లో మచ్చలేని మనిషి అని, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించినా అవినీతి మరక అంటని నాయకుడని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ సైనికులు సోనియా గాంధీ నమ్మకాలను నిలబెట్టి పార్టీని అధికారంలో తెచ్చేందుకు కృషి చేయాలని రేవంత్​రెడ్డి కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్​కుమార్​ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్​తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed