ఉద్యోగులకు పేటీఎమ్ ప్రోత్సాహకాలు!

by  |
ఉద్యోగులకు పేటీఎమ్ ప్రోత్సాహకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ సంవత్సరంలో తమ ఉద్యోగులకు రూ. 250 కోట్ల ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళిక(ఈసాప్స్‌) అందిస్తామని డిజిటల్ పేమెంట్ దిగ్గజ సంస్థ పేటీఎమ్ ప్రకటించింది. రానున్న మూడు నాలుగు నెలల్లో దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తీ చేస్తామని, పనితీరులో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకే కాకుండా కొత్తవాళ్లకు కూడా ఈ విధానం అమలు చేస్తామని వెల్లడించింది. ఈ విధానం సంస్థలోని ఎంతమందికి వర్తిస్తుందో సంస్థ స్పష్టం చేయలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి సంస్థ వార్షిక పనితీరు సమీక్షలను ప్రారంభించామని, ఆర్థిక సేవల విస్తరణ కోసం మరో 500కి మించిన నియామకాలను చేపడతామని పేటీఎమ్ సంస్థ వివరించింది. పనితీరు బాగాలేని ఉద్యోగులను రెండు నెలలపాటు పొడిగింపు ఇవ్వనున్న్నట్టు సంస్థ వెల్లడించింది.

Tags: Coronavirus, ESOPs, India, PayTm

Next Story

Most Viewed