ఫ్రీ గా మూడు సిలిండర్లను ఇస్తున్న Paytm

by  |
paytmgas
X

దిశ, వెబ‌్‌డెస్క్: మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని చూస్తున్నారా. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ప్రస్తుతం గ్యాస్ ధర రూ.1000కి దగ్గరగా ఉంది. ఇంత రేటు పెట్టి గ్యాస్ బుక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి గ్యాస్ లేకుండా మనం ఇంట్లో ఏ వంట చేసుకోలేము. అత్యవసరం అయిన గ్యాస్‌ను మీరు ఉచితంగా పొందితే . అలా ఒకటి రెండు కాదు మూడు సిలిండర్లు ఉచితంగా వస్తే. అవును మీరు విన్నది నిజమే. Paytm మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. మెుదటి మూడు గ్యాస్ బుకింగ్‌ల పై మంచి ఆఫర్ ఇస్తోంది.

Paytm వినియోగదారులు గ్యాస్ బుకింగ్‌ల పై రూ.3వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీని ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తుంది. PayTM ద్వారా మొదటిసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంతకు ముందు పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినట్లయితే ఈ ఆఫర్ వర్తించదు. Paytmని ఉపయోగించి మొదటిసారిగా గ్యాస్ బుక్ చేస్తున్నప్పుడు మొదటి మూడు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లకు ఒక్కో బుకింగ్‌కు రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. స్క్రాచ్ కార్డు ద్వారా రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ కనీస బుకింగ్ రూ.500.

డిసెంబర్ 2021లోపు మొదటి సిలిండర్‌ను తప్పనిసరిగా బుకింగ్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. డబ్బుని Paytm వాలెట్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. వినియోగదారులు తర్వాత 2 నెలల్లో మరో రెండు సిలిండర్లను బుకింగ్ చేయాలి. ఇలా బుకింగ్ చేసినప్పుడు స్క్రాచ్ కార్డ్‌ వస్తుంది. స్క్రాచ్ కార్డ్‌‌లో వచ్చిన అమౌంట్ 72 గంటలలోపు Paytm వాలెట్‌లో జమచేస్తారు.

JIO యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్.. ఒక్క రూపాయికే నెలంతా ఇంటర్నెట్



Next Story

Most Viewed