- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విషాదంలో పవన్ కల్యాణ్.. వీరాభిమాని అకాల మరణం

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక ఆయనను ఆదరించే అభిమానులు అంటే గబ్బర్‌సింగ్‌కు అమితమైన ప్రేమ ఉంటుంది. అందుకే తన అభిమానులు ఆపదలో ఉంటే పవన్ స్వయంగా వెళ్లి వారిని కలుస్తుంటాడు. తన వంతు సాయం చేస్తుంటాడు. కానీ, ఓ వీరాభిమాని ప్రాణం నిలవడం కోసం పవన్ చేసిన సాయం ఫలితం లేకుండా పోయింది. కృష్ణ జిల్లా లింగాలకు చెందిన భార్గవ్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. గతం నుంచి కేన్సర్‌తో పోరాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని ఇటీవల భార్గవ్‌ను పలకరించిన పవన్ చికిత్స నిమిత్తం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేశాడు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో భార్గవ్ చనిపోవడం బాధాకరం. ఈ వార్త విన్న పవన్, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Next Story