పతాంజలి బిస్కెట్లు తిని చిన్నారులకు అస్వస్థత

by  |
Patanjali Health Center Stores
X

దిశ, రాజేంద్రనగర్ : కాలపరిమితి ( ఎక్స్పైరీ డేట్) దాటిన బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. హైదర్ గూడలోని పతాంజలి స్టోర్స్ లో కొనుగోలు చేసిన బిస్కెట్లతోనే తన కుమారుడు అస్వస్థతకు గురయ్యారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ ప్రాంతంలో గత కొంతకాలంగా బిజ్జ వెంకటేష్ అనే వ్యక్తి పతాంజలి ఆరోగ్య కేంద్ర స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. ఈ స్టోర్ లో స్థానికంగా ఉండే ఓమ్‌రెడ్డి అనే వ్యక్తి 10 బిస్కెట్ ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. వాటిని ఓమ్‌రెడ్డి తన కుమారులకు ఇచ్చాడు. వాటిని తిన్న ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఓమ్‌రెడ్డి బిస్కెట్ ప్యాకెట్ లను గమనించగా అవి ఎక్స్పైరీ అయి మూడు నెలలు అయినట్లు గుర్తించారు.

వెంటనే ఆయన షాపు యజమాని బిజ్జ వెంకటేష్‌ ను నిలదీశాడు. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరాణా షాపు యజమాని బిజ్జ వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓమ్ రెడ్డి కోరారు.

Next Story

Most Viewed