Sexual Harrasment:17 మంది మహిళలపై సెక్సువల్ హరాస్‌.. అయినా అవార్డు ఇచ్చేశారు!

by  |
Sexual Harrasment:17 మంది మహిళలపై సెక్సువల్ హరాస్‌.. అయినా అవార్డు ఇచ్చేశారు!
X

దిశ, సినిమా : మలయాళ కవి, రచయిత ఓఎన్‌‌వీ కురుప్ స్మారకార్థం ఓఎన్‌వీ సాహిత్య పురస్కారాన్ని 2017 నుంచి అందించడం ఆనవాయితీగా వస్తోంది. సాహిత్యంలో చేసిన సేవలకు గాను ఓఎన్‌వీ కల్చరల్ అకాడమీ రచయితలు, కవులను ఈ అవార్డుతో సత్కరిస్తుండగా.. 2021కి గాను తమిళ లిరిసిస్ట్ వైరముత్తును వరించడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేసిన హీరోయిన్ పార్వతి తిరువొతు(Parvathy Thiruvothu).. 17 మంది మహిళలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఈ పురస్కారం అందించడం సిగ్గుచేటని మండిపడింది. మలయాళం కాకుండా ఇతర భాషల రచయితలకు ఈ అవార్డు అందించడం ఇదే తొలిసారి కాగా.. #MeToo నిందితుడికి ఇలాంటి ప్రఖ్యాత అవార్డు ఇచ్చేందుకు నిర్ణయించిన జ్యూరీపై విమర్శలు గుప్పించింది. ‘ఓఎన్‌వీ సార్ మనందరికీ గర్వకారణం.. కవిగా, రచయితగా ఆయన చేసిన సేవలు మరిచిపోలేము. అలాంటి మహానుభావుడి పేరు మీద ఉన్న అవార్డును లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వ్యక్తికి అందిస్తూ ఆయనను అవమానిస్తున్నారు’ అంటూ ఫైర్ అయింది.

Parvathy slams Malayalam literary award jury for honouring MeToo accused Tamil lyricist Vairamuthu



Next Story