పార్వతి ‘అమ్మ’ రాజీనామా!

by  |
పార్వతి ‘అమ్మ’ రాజీనామా!
X

దిశ, వెబ్‌డెస్క్ : మలయాళీ హీరోయిన్ పార్వతి.. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (AMMA) సభ్యత్వానికి రాజీనామా చేసింది. గతంలో సహనటి భావనను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడైన దిలీప్‌ను మళ్లీ అమ్మ (AMMA) లో చేర్చుకోవడం పట్ల ప్రధాన కార్యదర్శి ఎడవెల బాబును ప్రశ్నిస్తూ అప్పుడే చాలా మంది ఫ్రెండ్స్ రాజీనామా చేశారని.. కానీ అందరూ రిజైన్ చేస్తే సిస్టమ్‌ను రిపేర్ చేసేది ఎవరనే ఉద్దేశ్యంతో ఇన్నిరోజులు కొనసాగానని చెప్పింది. కానీ తాజాగా భావనపై చేసిన కామెంట్స్‌తో ‘అమ్మ’ వ్యవస్థ బాగుపడుతుందనే నమ్మకం కూడా పోయిందని చెప్పింది. దీంతో తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మ’ సంస్థచే తీవ్రంగా నిరాశపడిన ఒక నటి (భావన) దానిని విడిచిపెడితే, ఎడవెల బాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా సరిదిద్దుకోలేనివని అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు బాబు వికారమైన వైఖరికి నిదర్శనమని మండిపడింది పార్వతి.

మీడియా దీని గురించి చర్చించినప్పుడు అతని స్నేహితులు తనకు సపోర్ట్ చేస్తారని తెలుసని.. మహిళలకు సంబంధించిన సమస్యలు తెరపైకి వచ్చినప్పుడు వాళ్లు ఎప్పుడూ అదే విధంగా ప్రవర్తిస్తారని చెప్పింది. బాబు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ వెంటనే అమ్మ (AMMA)కు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మిగిలిన సభ్యులు కూడా ఇదే కోరుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపిన పార్వతి.. ఎవరు ముందుకు వస్తారో ఆసక్తిగా ఎదురుచూస్తానని తెలిపింది.

Next Story

Most Viewed