చిట్టి గుండెకు చిల్లు.. మెరుగైన చికిత్సకోసం కేటీఆర్ కు ట్వీట్

by  |
చిట్టి గుండెకు చిల్లు.. మెరుగైన చికిత్సకోసం కేటీఆర్ కు ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : నవమాసాలు మోసి ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి.. కానీ పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఎత్తుకొని ముద్దాడుదామనుకుంటే నెలరోజులైనా కాకముందే మాయదారి రోగం వచ్చి ఆస్పత్రికే పరిమితం చేసింది. హైదరాబాద్ ఆదిభట్ల ప్రాంతానికి చెందిన కె.ప్రభాకర్, శ్రీలత దంపతులకు నెల రోజుల క్రితం మగబిడ్డ జన్మించాడు. మొదట్లో కొంచెం అనారోగ్యంగా ఉన్నా.. సమస్యను గుర్తించలేకపోయారు. 5 రోజుల క్రితం బాబు అనారోగ్యానికి గురవడంతో నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

అయితే అక్కడ టెస్టులన్నీ చేయడంతో పిల్లాడికి పెద్ద సమస్యే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ బాబుకు హార్ట్ లో హోల్ ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు కిడ్నీ వాపు(హైడ్రోనిఫ్రోసిస్) వ్యాధి కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రభాకర్ రోజువారి కూలీగా పనిచేస్తుండటంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించే స్థితిలో లేరు. అయితే ప్రభుత్వం సాయం చేస్తుందన్న నమ్మకంతో రెండ్రోజులుగా ఎదురుచూస్తున్నారు. శనివారం ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ కి సమాచారం కూడా ఇచ్చారు. అయితే ఆయన నుంచి ఇంకా ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. సాయం చేయదలిచిన వారు 9391672728 నెంబర్ కి ఫోన్ చేయండి.

Next Story

Most Viewed