ప్రభుత్వ పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

by  |
ప్రభుత్వ పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
X

దిశ, సనత్ నగర్: బన్సీలాల్ పేట్ డివిజన్ లోని భోలక్ పూర్ లో ఉన్న మేకలమండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హై స్కూల్ ను రీ-లోకేట్ చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల హై స్కూల్ సాధన కమిటీ కన్వీనర్, హెచ్ జే యూ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అనేక ఏళ్లుగా ప్రాథమిక పాఠశాలగా 480 మంది విద్యార్థులతో కొనసాగుతున్నదని అన్నారు. చుట్టు పక్కల పేద ప్రజలకు విద్యను అందిస్తున్న ఈ స్కూల్ ను హైస్కూల్ గా మార్చాలని వారు కోరారు.

నగరంలో ఎక్కడైనా మూసివేసిన ఉన్నత పాఠశాలను ఇందులోకి రీ-లోకేట్ చేసి ఆరవ తరగతిని ప్రారంభించాలన్నారు. ఇదే విషయం ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పలుమార్లు కోరినట్లు వారు ప్రస్తావించారు. జిల్లా విద్యాశాఖాధికారిణి కూడా కలిశామన్నారు. హై స్కూల్ రీ లోకేట్ చేసేంత వరకు తమ ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఎం సి చైర్మన్ పుల్లారావు, ఉన్నత పాఠశాల సాధన కమిటీ కో కన్వీనర్లు, సీనియర్ జర్నలిస్టులు నర్సింగ్ రావు, విజే. శేషగిరిరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed