చిరు 'లూసిఫర్‌'.. డైరెక్టర్ పరశురామ్

by  |
చిరు లూసిఫర్‌.. డైరెక్టర్ పరశురామ్
X

మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్.. సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రాన్ని హీరో పృథ్వీ‌రాజ్ డైరెక్ట్ చేశాడు. తాను కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయిన చిరు కోసం మూవీ రైట్స్ కొనుగోలు చేశాడు రామ్ చరణ్. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ ప్రకటించాడు. సినిమాను చేయాలని ఉన్నా అందుకు టైం రావడంలేదు చిరుకు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న చిరుకు గీతాగోవిందం ఫేం పరశురామ్ అయితే బాగుంటుందని భావించారట. ఈ సినిమా బాధ్యతలను పరశురామ్‌కు అప్పగించాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

చిరు కొరటాల శివ డైరెక్షన్‌లో చేసే ఆచార్య మూవీ కంప్లీట్ కాగానే లూసిఫర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందట. సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ఇక డైరెక్టర్ పరశురామ్ చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా కమిట్ అయిన పరశురామ్ అది వెంటనే పూర్తి చేసేసి చిరు సినిమా గురించిన స్క్రిప్ట్ సెట్ చేసుకునే పనిలో ఉంటాడట. తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథను మారుస్తారని సమాచారం.

లూసిఫర్ చిత్రం పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో ఉంటుంది. సీఎం పీకేఆర్ మరణానంతం అతని వారసుడు ఎవరు అనేది బిగ్ క్వశ్చన్ కాగా.. ఆ టైంలోనే పీకేఆర్ సన్నిహితుడు మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తారు. పీకేఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కూతురు మంజు వారియర్‌కు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంటాడు. కానీ కూతురు రెండో భర్త అయిన వివేక్ ఒబేరాయ్ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఎలా అధిగమించాడనేది కథ.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story