పాకిస్తాన్‌ను ఆక్రమించే దిశగా చైనా.. రాజధానిపై కన్నేసిన డ్రాగన్..?!

by  |
పాకిస్తాన్‌ను ఆక్రమించే దిశగా చైనా.. రాజధానిపై కన్నేసిన డ్రాగన్..?!
X

దిశ,వెబ్‌డెస్క్: దశాబ్ధాల ‌కాలంగా ఎదిగేందుకు ప్ర‌పంచ శ‌క్తిగా ఎద‌గ‌డానికి పాక్‌ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది చైనా. అధికార కాంక్షతో చెలరేగిపోతున్న చైనాను తూర్పు నుంచి జ‌పాన్, ద‌క్షిణా ఉన్న దేశాలు కట్టడి చేస్తున్నాయి. దీంతో చైనాకు 14దేశాల‌తో త‌గాదాలు 12దేశాల‌తో జ‌ల‌వివాదాలున్నాయి. అందుకే వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకు వలవేసి వ్యూహాత్మ‌కంగా ప‌డ‌మర‌వైపు ఉన్న పాకిస్తాన్ నుంచి న‌రుక్కొస్తుంది. అత్యంత కీల‌క‌మైన గ‌ల్ఫ్, యూర‌ప్ దేశాల‌కు పాకిస్తాన్ నుంచి ద్వారంగా వినియోగించుకుంది. మ‌ధ్య ఏసియా, యూర‌ప్ దేశాల్లో వ్యాపారాన్ని విస్త‌రించుకునేలా చైనా పాకిస్తాన్ ను బ‌లిప‌శువును చేస్తుంది.

ఆకాశం కన్నా ఎత్తైన , సముద్రం కన్నా లోతైన చైనాతో మైత్రి బంధం పాకిస్తాన్ భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది.ఇప్పటికే చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఆర్సీ) ప్రాజెక్ట్ లో భాగంగా పాకిస్తాన్ తప్పనిసరిగా చైనా నుంచి పరికరాల్ని కొనుగోలు చేస్తుంది. కొనుగోళ్లకు కావాల్సిన అవసరమైన సహాయం చైనా అందిస్తుంది. దీంతో రుణాలు చెల్లించలేని పరిస్థితితో దివాలా తీసిన పాకిస్తాన్ చైనా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

ఉగ్రదేశపు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్న చైనా కన్ను పాక్ రాజధాని ఇస్లామాబాద్ పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమను ఆదుకోవాలంటూ చైనాను కోరారు. దీంతో డ్రాగన్ కంట్రీ పాక్ తో 15రకాల ఒప్పొందాలు కుదుర్చుకుంది. కానీ అన్నీ ఒప్పందాలకు అంగీకరించిన డ్రాగన్ కంట్రీ ఆర్ధిక సాయం చేయలేదు. అంటే చైనా..పాక్ నుంచి ఏదో ఆశించింది. డైరెక్ట్‌గా చెప్పకుండా.. తన కనుసైగలతో శాసిస్తున్న సౌదీ అరేబియా, మలేషియా దేశాల నుంచి పాక్ పై ఒత్తిడి తెస్తుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కు దుబాయ్ ప్రభుత్వం 3బిలియన్ డాలర్లను, మలేషియా 7బిలియన్ డాలర్లుగా అప్పుగా ఇచ్చింది. ఆ అప్పు తిరిగి ఇచ్చేలా చైనా చెప్పినట్లుగానే దుబాయ్, మలేషియా దేశాలు పాకిస్తాన్ పై ఒత్తిడి తెస్తున్నాయి. పాక్ మలేషియాకు 7బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఆ అప్పుకింద పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను మలేషియా స్వాధీనం చేసుకుంది. దుబాయ్ సైతం తన 3బిలియన్ డాలర్ల అప్పును చెల్లించాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో పాక్ అప్పుకావాలంటూ చైనా ముందు మొకరిల్లింది. ప్లాన్ ప్రకారం తాను అనుకున్నట్లుగానే డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్ ఇస్లామాబాద్ కు చెందిన ఫాతిమా జిన్నా పార్క్ పై కన్నేసింది. కుట్ర ప్రకారం ఆపార్క్ ను మార్టిగేజ్ కింద సెక్యూరిటీ గా పెట్టాలని కోరింది. అందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజధాని ఇస్లామాబాబ్ కు గుండెకాయ, 759ఎకరాల్లో విస్తరించిన ఫాతిమా జిన్నా పార్క్ చైనాకు మార్టిగేజ్ కింద సెక్యూరిటీగా పెట్టి 3బిలియన్ల డాలర్లను అప్పుగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

మార్టిగేజ్ కోసం క్లియరెన్స్ ఇచ్చేలా ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఫెడరల్ క్యాబినెట్ కాన్ఫరెన్స్ ఎజెండాలో చేర్చారు. దీనిపై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవ్వాళ పాక్ ప్రభుత్వ ఆస్తుల్ని మార్టిగేజ్ కిందపెడితే…రాబోయే రోజుల్లో పాక్ ను చైనా స్వాధీనం చేసుకుంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story