కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ కోర్టు కీలక తీర్పు

by  |
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ కోర్టు కీలక తీర్పు
X

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు అవకాశమివ్వాలని పాక్ అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. గతంలో జాదవ్‌కు లేదా భారత ప్రభుత్వం నుంచి సమ్మతి లేకుండానే పాకిస్తాన్ ఆయనకు లీగల్ కౌన్సెల్‌ను నియమించింది.

తాజాగా, భారత్‌కు మరొక అవకాశమివ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. జాదవ్‌కు న్యాయవాదిని ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని, అయితే, ఆ లాయర్ పాకిస్తాన్ జాతీయుడై ఉండాలని మెలిక పెట్టింది. పాకిస్తాన్ లీగల్ టీమ్‌కు సహాయకంగా భారత న్యాయవాదులకైతే ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాన్ని కోర్టు కల్పించలేదని అటార్నీ జనరల్ ఖాలిద్ జావెద్ ఖాన్ తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానం సూచించిన ఆర్డినెన్స్ అమలుచేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడటం గమనార్హం. పాకిస్తాన్‌లో గూఢచర్యం, తీవ్రవాద అభియోగాల కింద జాదవ్‌కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed