గోపీచంద్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సైన్ సెంటర్

by  |
గోపీచంద్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సైన్ సెంటర్
X

దిశ, స్పోర్ట్స్: దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్, భారత జట్టు హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీలో కొత్తగా ఆరు కోర్టులను.. దానితో పాటు స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కోటక్ కంపెనీ అందిస్తున్న సహాయంతో ఇప్పటికే ఉన్న కోర్టులకు అదనంగా ఆరు బ్యాడ్మింటన్ కోర్టులను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ద్రోణా ఫ్యాక్టర్- స్కల్ప్‌టింగ్ అర్జునాస్’ అనే అంశంపై మాట్లాడటానికి గోపీచంద్‌ను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కీలకమైన ఒలింపిక్స్ ముందు కరోనా వల్ల ప్రాక్టీస్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లోని అకాడమీలో శిక్షణ ఇచ్చాము. అంతే కాకుండా ఈ కష్టకాలంలో పిల్లలకు కూడా ఆటపై శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించామని గోపీచంద్ చెప్పారు. త్వరలో మేము నిర్మించబోయే స్పోర్ట్స్ సైన్ సెంటర్ అండ్ కోచ్ డెవెలెప్‌మెంట్ సెంటర్‌క కోటక్ కంపెనీ చాలా సాయం చేస్తున్నదని గోపీ చంద్ తెలిపారు.



Next Story

Most Viewed