అమ్మాయిల పెళ్లి వయసు 21పై ఓవైసీ షాకింగ్ కామెంట్స్

by  |
MIM party chief Asaduddin owaisi
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమ్మాయిల వివాహ వయసు 18 నుంచి 21 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల ఓట్లు రాబట్టడానికే మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఫైర్ అయ్యారు.

అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఓటు వేసి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోవచ్చు కానీ పెళ్లి మాత్రం చేసుకోకూడదా అంటూ నిలదీశారు. పితృస్వామ్యానికి అనుకూలమైన ఈ ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం ఆశించినదేనని ఆయన అన్నారు. అలాగే భారత దేశంలో ఎన్నో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పెళ్లి చేసుకునే వయస్సు విషయం కంటే విద్య, యువత ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని ఓవైసీ చురకలంటించారు.


Next Story