ఆక్సిజన్ సరఫరాలో భారతీయ రైల్వే నిమగ్నం

by  |
Oxygen supply under Indian Railways
X

దిశ,తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ లో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు భారతీయ రైల్వే చర్యలు చేపట్టిందని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ అన్నారు. కరోనా కాలంలో రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యలను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వివరించారు. ఆక్సిజన్ సరఫరాని భారతీయ రైల్వే సులభతరం చేసిందని తెలిపారు. భారతీయ రైల్వే ఆక్సిజన్ రైళ్లను నడుపుతోందని, 150 టన్నుల ఆక్సిజన్ ని సరఫరా చేసినట్లు తెలిపారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఆక్సిజన్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారతీయ రైల్వే కరోనా రోగులకు సేవలందించడంలో ముందువరుసలో ఉందన్నారు. అందుకోసం రైలు బోగీలను ఐసోలేషన్ కేంద్రాలుగా, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 4176 కరోనా కేర్ బోగీలు అందుబాటులో ఉన్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేరకు కావాల్సినన్ని బోగీలను అందించేందుకు సిద్ధంగా రైల్వే శాఖ ఉందని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు కూడా 70 శాతం నడుస్తున్నాయన్నారు. రోజుకు సగటున 1514 స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. ప్రయాణికులు పెరుగుతున్న దృష్ట్యా ఏప్రిల్-మే మధ్యలో దేశంలోని సెంట్రల్ రైల్వే 143 రైళ్లు, వెస్టర్న్ రైల్వే 154 రైళ్లు, నార్తర్న్ రైల్వే 27 రైళ్లు, ఈష్ట్ సెంట్రల్ రైల్వే 02 రైళ్లు, నార్త్ ఈస్టర్న్ రైల్వే 09 రైళ్లు, నార్త్ సెంట్రల్ రైల్వే 01 రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే 03 రైళ్లు నడపనున్నట్లు ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed