భారతీయులకు బిగ్ షాక్: హ్యాకర్ల చేతిలో డెబిట్,క్రెడిట్ కార్డ్ ల డేటా

by  |
భారతీయులకు బిగ్ షాక్:  హ్యాకర్ల చేతిలో డెబిట్,క్రెడిట్ కార్డ్ ల డేటా
X

దిశ,వెబ్ డెస్క్: మీరు అమెజాన్, మేక్ మైట్రిప్, స్విగ్గి లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. 100 మిలియన్లకు పైగా డెబిట్,క్రెడిట్ కార్డ్ అకౌంట్ వివరాలు డార్క్‌వెబ్‌లో లీకైనట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూర్‌లో అమెజాన్, మేక్‌మైట్రిప్ మరియు స్విగ్గితో సహా భారత్ తో పాటు ఇతర దేశాలకు బిజినెస్ ట్రాన్సాక్షన్ పేమెంట్ గేట్ వే ‘జస్‌పే’కి, డార్క్‌వెబ్‌లో లీకైన డేటాతో సంబంధం ఉన్నట్లు తేలింది.

మార్చి 2017 నుంచి ఆగస్ట్ 2020

డార్క్‌వెబ్ లో లీకైన డేటా మార్చి 2017 నుంచి ఆగస్ట్ 2020 మధ్య జరిగిన ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించినట్లు తెలుస్తోంది. ఇందులో అనేక మంది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత వివరాలతో పాటు వారి పూర్తి పేర్లు, ఫోన్ నెంబర్లు మరియు ఈ -మెయిల్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వెనుక భాగంలో ఉండే చివరి నాలుగు అంకెల డేటా ఉన్నట్లు సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ రాజ్‌శేఖర్ రాజహరియా నేషనల్ మీడియాకు తెలిపారు. లీకైనా డేటా హ్యాకర్ దగ్గర ఉందని, ఆ డేటా వల్ల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కష్టమర్ల డేటాను అమ్ముకునేందుకు జెస్‌పే పేరుతో హ్యాకర్ టెలిగ్రాం ద్వారా కష్టమర్లను సంప్రదిస్తున్నట్లు రాజ్‌శేఖర్ రాజహరియా చెప్పారు.

జెస్‌ పే తో జాగ్రత్త

‌బెంగళూర్ కు చెందిన జెస్ పేకి, హ్యకర్ కు సంబంధం ఉందన్నారు. MySQL శాంపిల్స్ ఫైళ్ళలో లభించే డేటా ఫీల్డ్‌లను జస్‌పే API డాక్యుమెంట్ ఫైళ్ల‌తో పోల్చి చూడగా అవి రెండూ ఒకేలా ఉన్నట్లు చెప్పారు. అయితే ఈ డేటా లీకేజీపై జెస్‌పే వ్యవస్థాపకుడు విమల్ కుమార్ ను సంప్రదించగా ఆగస్ట్ 18న డేటా లీకైనట్లు చెప్పారు. లీకేజీ గురించి పూర్తిగా తెలిసే వరకు ట్రాన్సాక్షన్లను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

కాగా గత నెల డిసెంబర్ లో భారతీయులకు చెందిన ఏడు మిలియన్ల భారతీయ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు హోల్డర్ల వ్యక్తిగత డేటాను డార్క్‌వెబ్ ద్వారా లీకైన విషయాన్ని రాజహరియా గుర్తు చేశారు. 1.3 మిలియన్లకు పైగా ఇండియన్ బ్యాంకింగ్ కస్టమర్ల వ్యక్తిగత వివరాలన్నీ 2019లోనే డార్క్‌వెబ్‌లో అమ్ముడైనట్లు సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ రాజ్‌శేఖర్ రాజహరియా వెల్లడించారు.

Next Story

Most Viewed