తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారు

by  |
తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారు
X

దిశ, వెబ్ డెస్క్: వరద బాధితులకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరద బాధితులను కేసీఆర్ సర్కార్ ఆదుకుంటే బీజేపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. హైదరాబాద్ లో తాము సాయం చేస్తే బీజేపీ నేతలు అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. జనం లేని సేన జనసేన అని, సైన్యం లేని నాయకుడు పవన్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతి రేకులు ఒక్కటవుతున్నారని అన్నారు. ఎందరు కలిసినా ప్రజలు టీఆర్ఎస్‌‌‌‌నే ఆదరిస్తారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story