ఏడాదిలో రూ. 27 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి!

by  |
ఏడాదిలో రూ. 27 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మందగమనం, కరోనా సంక్షోభం వల్ల ఏడాది కాలంలో భారీగా ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఈ సంవత్సరం కాలంలో ఏకంగా రూ. 27 లక్షల కోట్లను కోల్పోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం విలువ దేశ జీడీపీలో 13.5 శాతానికి సమానం. అంటే, ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ రూ. 20 లక్షల కోట్ల కంటే 35 శాతం అధికం. అలాగే, ఈ సంవత్సరం కాలంలో ప్రతి 10 స్టాక్స్‌లో 9 స్టాక్‌లు నెగెటివ్ రిటర్న్‌లను ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, సెన్సెక్స్‌లో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల్లో 10 శాతం కంపెనీలు మాత్రమే రెండంకెల ఆదాయాన్ని దక్కించుకున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ దీపక్ స్పందిస్తూ.. మోదీ సంవత్సర పాలనకు 10 మార్కులకు గాను 7 మార్కులిచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ పనితీరు మార్కెట్ మూలధనం ప్రామాణికంగా ఉండదు. మార్కెట్ల పనితీరు కేవలం ప్రభుత్వ పాలసీ మీద ఆధారపడి జరగదు. దీనికి అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు లాంటి అనేక అంశాలను మార్కెట్లను ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు. మార్చి నుంచి కరోనా వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనికిముందు.. డిసెంబర్ త్రైమాసికం వరకూ మందగమనం, జీఎస్టీ అంశాలు ఎక్కువ ప్రభావం చూపించాయని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేశ్ షా తెలిపారు. గడిచిన 100 ఏళ్ల మార్కెట్ల చరిత్రను పరిశీలిస్తే భారత మార్కెట్లో అనుకూల వాతావరణ ఉందని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed