‘ఆరోగ్య సేతు’ రేటింగ్ ఇలా… ఏమి సేతు!

by  |
‘ఆరోగ్య సేతు’ రేటింగ్ ఇలా… ఏమి సేతు!
X

కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను విడుదల చేసింది. అయితే దీనిపై పొగడ్తలు కురిపిస్తున్న వారితోపాటు విమర్శలు గుప్పిస్తున్నవారూ లేకపోలేదు. ఈ క్రమంలోనే మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఈ యాప్‌కు ఐదు స్టార్లకుగాను ఒక్క స్టార్ రేటింగే ఇచ్చారు. గతంలో ఇదే ఇనిస్టిట్యూట్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఈ యాప్‌కు రెండు స్టార్ల రేటింగ్ ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని ఒక స్టార్ రేటింగ్‌కి మార్చడం చర్చనీయాంశంగా మారింది.

అయితే డేటా మినిమైజేషన్ విషయంలో ఆరోగ్యసేతుకు ఈ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. డేటా మినిమైజేషన్ అంటే ఒక యాప్ నడవడానికి అవసరమైన డేటా కంటే ఎక్కువ డేటాను సేకరించకుండా తగ్గించుకోవడం. ఆరోగ్య సేతు యాప్ విషయంలో ఇదే జరుగుతోందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ తన నివేదికలో తెలిపింది. అంటే ఆరోగ్యసేతు యాప్ పనిచేయడానికి కావాల్సిన పారామీటర్ల కంటే ఎక్కువ డేటాను వినియోగదారు నుంచి సేకరిస్తోందన్నమాట. ఇది మాత్రమే కాకుండా డేటా వాడకం, వాలంటరీ వాడకం, పార్శదర్శకత విషయాల్లో ఆరోగ్య సేతు యాప్ వెనకబడింది. గతంలో ఈ యాప్ ద్వారా సేకరించిన డేటాను సకాలంలో డిలీట్ చేస్తున్నందుకు 2 రేటింగ్ ఇచ్చినప్పటికీ డేటా మినిమైజేషన్ ప్రాముఖ్యమైన అంశం కాబట్టి రేటింగ్ తగ్గించినట్లు ఇనిస్టిట్యూట్ పేర్కొంది.

కొవిడ్ 19 నేపథ్యంలో ప్రపంచదేశాలు విడుదల చేసిన యాప్‌ల ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందనే విషయం గురించి మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్.. ఈ యాప్‌లను సమీక్షించి రేటింగ్ ఇచ్చింది. ఈ యాప్‌లు.. వాడకం మీద పరిమితి విధిస్తున్నాయా? సేకరించిన డేటా ఉపయోగించిన తర్వాత డిలీట్ చేస్తున్నారా? డేటా మినిమైజేషన్ చేస్తున్నారా? సేకరణ విధానాలు ఎలా ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాల ద్వారా యాప్ రేటింగ్ ఇస్తున్నారు.



Next Story

Most Viewed