క్రికెట్ చరిత్రలో మరిచిపోని రోజు.. మాస్టర్ బ్లాస్టర్ మైదానం వీడిన క్షణం(వీడియో)

by  |
క్రికెట్ చరిత్రలో మరిచిపోని రోజు.. మాస్టర్ బ్లాస్టర్ మైదానం వీడిన క్షణం(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్‌ను దేవుడిగా కొలుస్తారు ఆయన అభిమానులు. సచిన్ అంటే క్రికెట్‌లో ఒక ట్రెండ్. అతని బ్యాటింగ్‌ స్టైల్‌తో ఎంతగానో అభిమానులను సంపాదించుకున్నాడు సచిన్. కానీ ఎంత గొప్ప ఆటగాడు అయిన ఏదో రోజు రిటైర్ అవ్వాల్సిందే. సరిగ్గా ఇదే రోజున 2013లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి తప్పుకున్నాడు. నేటితో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఎనిమిదేళ్ల అవుతుంది. ముంబైలో తన సొంత మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన 200వ టెస్ట్ మ్యాచ్ తర్వాత అతను అన్ని రకాల క్రికెట్ నుండి వైదొలిగాడు. తన చివరి మ్యాచ్ తర్వాత సచిన్ చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను కంటతడి పెట్టించింది.

‘సమయం చాలా త్వరగా గడిచిపోయింది, కానీ, మిగిలిపోయిన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ముఖ్యంగా ‘సచిన్ సచిన్’ కీర్తన నేను ఊపిరి ఆగే వరకు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది’ అంటూ సచిన్ భావోద్వేగానికి గురి అయ్యాడు.

1989లో 16 ఏళ్ల వయస్సులో భారతదేశం తరఫున అరంగేట్రం చేశాడు టెండూల్కర్. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ 34,357 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. 2019లో ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన ఆరవ భారతీయుడు సచిన్. ODIలలో 18,426 పరుగులు, టెస్ట్ మ్యాచ్‌లలో 15,921 పరుగులు చేశాడు సచిన్. ఈ రోజు ఆయన అభిమానులకు మర్చిపోలేని రోజు.



Next Story

Most Viewed