టోక్యో ఒలింపిక్స్ సెయిలింగ్‌లో ‘స్వర్ణం’ భారత్ సొంతం

by  |
టోక్యో ఒలింపిక్స్ సెయిలింగ్‌లో ‘స్వర్ణం’ భారత్ సొంతం
X

దిశ, స్పోర్ట్స్: భారత సెయిలర్ నేత్ర కుమనన్ గ్రాన్ కనేరియా సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇండియా తరపున టోక్యో ఒలింపిక్స్ సెయిలింగ్‌లో పాల్గొన్న మొదటి మహిళగా రికార్డు సృష్టించిన నేత్ర.. తాజాగా యూరోపియన్ రీజనల్ ఓపెన్ ఈవెంట్ అయిన గ్రాన్ కనేరియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. లేజర్ రేడియల్ ఈవెంట్‌లో మూడు రేసులకు గాను మూడింటిలో నేత్ర మొదటి స్థానంలో నిలిచింది.

ఇక స్పెయిన్‌కు చెందిన బెనేటో లాంచో, మార్టీనా రినోచాచో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా, నేత్ర విజేతగా నిలవడంపై పలువురు అభినందనలు కురిపిస్తున్నారు. నేత్ర స్వర్ణం సాధించినట్లు సాయి మీడియా తమ ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నది. స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో మూడు దేశాలకు చెందిన 20 మంది సెయిలర్లు పాల్గొన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో నేత్ర కుమనన్ 35వ స్థానంలో నిలిచింది.

Next Story

Most Viewed