సెవెన్టీలో ట్వంటీలా.. క్రీడల్లో రాణిస్తున్న వృద్ధులు

by  |
Older people
X

దిశ, కుత్బుల్లాపూర్: వారంతా ఏడు పదుల వయసున్న వారే. కానీ, యువతను సైతం మరిపించేలా చలాకీగా పనులు చేస్తున్నారు. పనులే కాదు.. క్రీడల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరిలా కాకుండా వారు తమ వయస్సును సైతం లెక్క చేయకుండా క్రీడల్లో పాల్గొంటున్నారు. ఎంతో మంది 50ఏళ్లు దాటితే కాళ్లు, ఒళ్ల నొప్పులతో బాధపడుతూ మంచానికే పరిమితమవుతున్నారు. కానీ, వీరు మాత్రం ఏడు పదులు దాటినా అలసటను దారిదాపుల్లోకి రానివ్వడం లేదు. ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్నారు. క్రీడల్లో భాగస్వాములవుతూ బంగారు పథకాలు సాధించి తీరుతున్నారు. ఇందుకు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వేదికైంది.

ప్రతీ రోజు గంట ఆటలు : రాజ్ కుమార్

నా వయస్సు 69 సంవత్సరాలు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే నానుడిని నిజం చేయాలనేదే నా ఆకాంక్ష. నాలో ఉన్న సత్తానూ నిరూపించేందుకు క్రీడలు మంచి అవకాశం. ఆటపోటీలతో అనారోగ్యం దరి చేరదు. దవాఖానకు వెళ్లాల్సిన అవసరంలేదు. నా ఆరోగ్యం బాగుంది. ప్రతీ రోజు ఒక గంటసేపు క్రీడల కోసం కేటాయిస్తా.

ఇండోర్ గేమ్స్ తగ్గించాలి : ఏఆర్వీ చారి, ఫార్మా కంపెనీ మాజీ మేనేజర్

నా వయస్సు 68 సంవత్సరాలు. ప్రతిరోజు క్రీడల్లో పాల్గొంటా. ఇంకా చాలా మంది ఇలాంటి వాటిని వేదికగా మార్చుకోవాలి. పిల్లలు ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్​ఆడుతున్నారు. అలాంటి వాటికి స్వస్తి చెప్పి మైదానంలో పరుగులు పెట్టాలి. నిత్యం క్రీడల్లో పాల్గొంటే మరి కొన్ని రోజులు ఎక్కువగా జీవించగలుగుతాం.

మహిళ్లలోనూ చైతన్యం : భారతమ్మ, గృహిణి

నా వయస్సు 70 సంత్సరాలు. గతంలో కేవలం పురుషులు మాత్రమే క్రీడలకు అర్హులనేలా ఉండేది. కానీ రోజులు మారాయి. మహిళలు సైతం క్రీడల్లో రాణిస్తారనడానికి నేనే ఉదాహరణ. ఇప్పటి వరకు పరుగు పందెంలో రెండు బంగారు పథకాలు సాధించాను. ఇలాంటి క్రీడల్లో రాణిస్తే కొంతకాలం
ఎక్కువగా జీవిస్తాము.



Next Story

Most Viewed