అంతర్జాతీయ మార్కెట్లోనూ ఓలా స్కూటర్ల విక్రయాలు!

by  |
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఓలా స్కూటర్ల విక్రయాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకెళ్లనున్నట్టు వెల్లడించింది. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల కోసం ‘హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌’ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన కంపెనీ ఈ ఏడాది జులైలో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. “మొట్టమొదటి వాహనాన్ని భారత్‌లో ప్రారంభిస్తాం. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే అంతర్జాతీయ మార్కెట్లోనూ ప్రవేశిస్తామని” ఓలా ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు.

గతేడాది ఓలా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ కోసం రూ. 2,400 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. దీని ద్వారా దాదాపు 10 వేల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా ఉంటుందని, ఏడాదికి 20 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని ఈ కర్మాగారం కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్నోవేషన్‌ మరింత స్థిరంగా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యూరప్ వంటి కీలక మార్కెట్లతో సహా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, యూకే, స్పెయిన్ లాంటి మార్కెట్లలో తమ స్కూటర్లను విక్రయిస్తామని భవీష్ అగర్వాల్ వెల్లడించారు.



Next Story

Most Viewed