ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ డొనేట్ చేసిన NRI డాక్టర్ యమున

by  |
ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ డొనేట్ చేసిన NRI డాక్టర్ యమున
X

దిశ, పర్వతగిరి : దేశంలో రెండవ దశ కరోనా విజృంభిస్తుండటంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా రోగులకు ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు రోజూ చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవాస భారతీయులు స్పందించి తమకు తోచిన సహాయం అందిస్తూ కరోనాను ఎదుర్కొనేందుకు సహాయపడుతున్నారు.

వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ప్రధాన పాత్ర పోషించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను ప్రవాస భారతీయ డాక్టర్ యమున ప్రభుత్వాసుపత్రికి డోనేట్ చేశారు. 10 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ నరసింహ స్వామి, డాక్టర్ సోమశేఖర్‌లు ప్రారంభించారు. కరోనా చికిత్సలో ఉపయోగించే కాన్సంట్రేటర్‌ను డోనేట్ చేసిన డాక్టర్ యమున గారిని ఆసుపత్రి సూపరిండెంట్ నరసింహ స్వామి, వైద్యులు అభినందించారు.



Next Story