ఏడాదికి రెండుసార్లు ఎన్ఆర్ఏ సెట్ 

by  |
ఏడాదికి రెండుసార్లు ఎన్ఆర్ఏ సెట్ 
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్ టెక్నికల్) సర్వీసులను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తూ నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్‌ఆర్ఏ సెట్‌ను ఏటా రెండు సార్లు నిర్వహించనున్నారు. ఇందులో వచ్చిన స్కోరుకు మూడేండ్లపాటు వ్యాలిడిటీ ఉండనున్నది.

పరీక్షను ఇంగ్లీష్, హిందీలో మాత్రమే కాకుండా 12 ఇతర భాషల్లో కూడా నిర్వహించనున్నారు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సిబ్బంది మంత్రిత్వశాఖ పేర్కొంది. రైల్వే, ఆర్థిక మంత్రిత్వశాఖలు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్(RRBS), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలెక్షన్ (IBPS)లకు ఎన్‌ఆర్ఏ నేతృత్వం వహించనుంది.



Next Story

Most Viewed