ఇంట్లో కూసోలేను సారూ.. అందుకే ఈ పని చేస్తున్నా..

by Shamantha N |   ( Updated:2021-03-05 08:06:44.0  )
ఇంట్లో కూసోలేను సారూ.. అందుకే ఈ పని చేస్తున్నా..
X

దిశ, వెబ్ డెస్క్ : సాయం చేయాలనే మనస్సు ఉంటే.. ఏవిధంగానైనా సాయం అందించవచ్చని ఓ ఐఏఎస్ అధికారి నిరూపించారు. అలా తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ఓ వృద్ధుడికి తన వంతు సాయం అందజేసారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీలోని రాయబరేలీలో రోడ్డు పక్కన విజయ్ పాల్ సింగ్(98) అనే వృద్ధుడు శనగలు, బఠానీలు అమ్ముకుంటున్నాడు.

సింగ్ వద్ద శనగలు కొన్న ఓ వ్యక్తి నువ్వు ఎందుకు ఈ వయస్సులో ఇలా శనగలు అమ్ముతూ కష్టపడుతున్నావని అడగ్గా.. సింగ్ సమాధానం ఇస్తూ ఇంట్లో కూర్చుని ఏం చేయమంటారు సారు.. అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా మా ఇంట్లో సభ్యులు ఎక్కువ తలా ఓ పని చేస్తేనే పూట గడుస్తుందని ఆవేదనతో చెప్పారు. నాకు ఇంకా పని చేసే సామర్థ్యం ఉందని నవ్వుతూ బదులిచ్చాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో కాస్త యూపీ ఐఏఎస్ అధికారి వైభవ్‌కు కనిపించింది. దీంతో వృద్డుడి వివరాలను ఆ అధికారి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐఏఎస్ అధికారి.. సింగ్‌ను తన దగ్గరకు పిలిపించుకుని ఆయనకు రూ.11 వేల ఆర్థిక సాయం అందించారు. అంతే కాకుండా ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణానికి సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయనకు ఎటువంటి సాయం కావాలన్నా సీఎం కార్యాలయం అందజేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story