మూడో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అమీర్ ఖాన్.. స్పందించిన మాజీ భార్య

by  |
Amir Khan
X

దిశ, సినిమా: ఇటీవల కిరణ్‌రావుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేసిన బాలీవుడ్ హీరో అమీర్‌ ఖాన్‌.. తాజాగా తన మూడో పెళ్లికి సంబంధించిన వార్తలపై స్పందించాడు. తన అప్ కమింగ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల తర్వాత పెళ్లి గురించి ప్రకటిస్తారని.. సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్‌పై స్పందించిన అమీర్, కిరణ్ రావు.. ‘అందరూ అనుకుంటున్నట్లుగా మూడో పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ రిపోర్టులు అన్నీ ఫేక్. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పనిలో బిజీగా ఉన్నాం’ అని తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక గతంలో ‘దంగల్’ మూవీలో కూతురిగా కనిపించిన ఫాతిమా సనా షేక్‌ను అమీర్‌ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది. ఇక కిరణ్ రావుతో విడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి తమ రాబోయే చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ నిర్మాణంలో బిజీగా ఉన్నారు.



Next Story

Most Viewed