‘వాటి పై బ్యాంకులు చార్జీలు పెంచవు’

by  |
‘వాటి పై బ్యాంకులు చార్జీలు పెంచవు’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌యూ బ్యాంకులు) సేవల ఛార్జీలను పెంచాయనే నివేదికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది. నవంబర్ 1 నుంచి కొన్ని పరిమితులకు మించి డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం వినియోగదారుల నుంచి ఛార్జీలను వసూలను చేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా మినహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇటువంటి ఛార్జీలను పెంచలేదని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత కొవిడ్-19 సంబంధిత పరిస్థితుల దృష్ట్యా మార్పులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం… పీఎస్‌యూ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు తమ సేవలకు సరసమైన, పారదర్శకంగా, వివక్షత లేని రీతిలో ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ, ఖర్చుల ఆధారంగా ఛార్జీలను పెంచవని, భవిష్యత్తులోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులు కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఛార్జీలను పెంచేందుకు ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Next Story

Most Viewed