రైళ్లు నడుస్తాయ్.. ఆందోళన వద్దు : రైల్వే శాఖ

by  |
రైళ్లు నడుస్తాయ్.. ఆందోళన వద్దు : రైల్వే శాఖ
X

న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రైన్ సేవలపై ముసురుకుంటున్న అనుమానాలకు రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ట్రైన్ సేవలను నిలిపేయబోమని, అవసరమున్న మేరకు ట్రైన్ సేవలను కొనసాగిస్తామని స్పష్టతనిచ్చింది. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ ఉన్న మేరకు ట్రైన్‌లను నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ వివరించారు.

వేసవిలో ట్రైన్ ప్రయాణాలు పెరగడం సర్వసాధారణమేనని, అందుకే వీటి కోసం ప్రత్యేకంగా సేవలందించడానికి ఇప్పటికే ప్రకటనలు చేశామని అన్నారు. అయితే, గతేడాది తరహాలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ముప్పు ఉన్నదని వలస కార్మికులు చాలా మంది సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రైన్ సేవలకు డిమాండ్ పెరిగిందని తెలుస్తున్నది.



Next Story

Most Viewed