గుడికి వెళ్లిన ఆ భక్తులకు షాక్

by  |
గుడికి వెళ్లిన ఆ భక్తులకు షాక్
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ఆషాఢ మాసం బోనాలు సమర్పించడానికి వచ్చిన భక్తులను ఆలయ నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. ప్రవేశం లేదని ముందే తెలిపితే బోనాలతో వచ్చేవాళ్లం కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని ( ఎస్ఆర్ఎస్ ) అస్తబాలిలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ఉదయం 6 గంటలకు పలువురు భక్తులు ఆషాఢ మాసం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే 11 గంటల తర్వాత నుంచి భక్తులను లోపలికి పంపడానికి ఆలయ నిర్వాహకులు నిరాకరించారు. దీంతో భక్తులు, నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరిగింది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తతో దర్శనాలు చేసుకోవచ్చన్న బోర్డు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కొంతమంది భక్తులు ఆలయం గేటు ముందు కోళ్లు కోసి, నైవేథ్యం సమర్పించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed