రైతు సంఘాలతో చర్చలుండవ్ : తోమర్

by  |
రైతు సంఘాలతో చర్చలుండవ్ : తోమర్
X

దిశ, వెబ్‌డెస్క్ : కొత్తగా తీసుకొచ్చిన అగ్రి చట్టాలపై అటు కేంద్రం ఇటు రైతు సంఘాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. ఆ ఒక్కటి తప్ప మిగతావి ఏమైనా ఉంటే అడగాలని కేంద్రం స్పష్టంచేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు ఢిల్లీలో 12వ సారి భేటీ అయ్యారు. ఈసారి కూడా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి. అయితే, ఈ రోజు సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చట్టాలను రద్దు చేసేది ఉండబోదని.. మేం ఇచ్చే ఆఫర్‌ను పరిగణలోనికి తీసుకోవాలని రైతు సంఘాలకు తేల్చిచెప్పినట్లు సమాచారం.

అంతేకాకుండా తదుపరి సమావేశాలకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించకపోవడం గమనార్హం. అవసరమైతే చట్టాలకు సవరణలు చేస్తామని, 18నెలల పాటు కొత్త వ్యవసాయ చట్టాలు అమలుకాకుండా చూస్తామని తోమర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకు రైతు సంఘాల నుంచి విముఖత వ్యక్తమైంది. కాగా, సమావేశానికి ముందు తమను మూడున్నర గంటల పాటు వ్యవసాయ శాఖ మంత్రి వెయిట్ చేయించారని, అది రైతులను అవమానించినట్లే అని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ మెంబర్ ఎస్‌ఎస్ పందర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.



Next Story

Most Viewed