చరణ్ ఫోన్‌లో చిరంజీవి నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలిస్తే ఫిదా?

by Anjali |
చరణ్ ఫోన్‌లో చిరంజీవి నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలిస్తే ఫిదా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ బాండింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. కెరీర్ మొదట్లో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ధ‌ృవ, నాయక్, ఎవడు, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గ్లోబల్ స్టార్ గా ట్యాగ్ దక్కించుకున్నాడు. కేవలం నటనలో కాకుండా మంచితనంలో కూడా రామ్ చరణ్ కు గొప్ప పేరు ఉంది. ఇకపోతే రామ్ చరణ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

చరణ్ మొబైల్ లో మెగాస్టార్ చిరంజీవి పేరును ఏమని సేవ్ చేసుకున్నాడో నెట్టింట చర్చానీయంశంగా మారింది. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ తన వాల్ పేపర్ ఫోటోని ఆంజనేయ స్వామి ఫోటోగా మార్చుకున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన పిక్స్ కూడా ఇటీవల నెట్టింట బాగా ట్రెండ్ అయ్యాయి . ఇదే మూమెంట్లో చిరంజీవి పేరుని ఏమని సేవ్ చేసుకున్నాడు అనే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ పేరుని చరణ్ తన ఫోన్ లో నాన్న గారు అంటూ సేవ్ చేసుకున్నారట. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క జీవితంలో నాన్నకు ప్రత్యేకమైన స్థానం, గౌరవం ఉంటుంది అంటూ చరణ్ ను కొనియాడుతున్నారు.

Next Story

Most Viewed