‘ఖమ్మంలో కరోనా లేదు’

by  |
‘ఖమ్మంలో కరోనా లేదు’
X

దిశ‌, ఖ‌మ్మం: జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదనీ, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారి మాల‌తి తెలిపారు. జిల్లాలో క‌రోనా వ్యాప్తి, తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖమ్మంలో 537 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నారనీ, వీరిలో 526 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. మిగతా 10మందిలో లక్షణాలు కనిపించగా వారిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 105 మందికి కరోనా పరీక్షలు జరుపగా, వంద మందికి నెగటివ్ రిపోర్ట్స్ రాగా, మిగ‌తా ఐదుగురి నివేదికలు రావాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి జిల్లా నుంచి 25 మంది వెళ్లొచ్చారనీ, అయితే ఇందులో 15 మంది హైదరాబాదులోనే నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ నివాసముంటున్న 10మందికి వైద్య పరీక్షలు చేయగా, అంద‌రికీ నెగ‌టివ్ వచ్చింద‌ని వివరించారు.

Tags: no corona cases, MPDO malathi, khamma, corona, virus, home quarantine

Next Story