గోవా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక

by  |
గోవా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైతన్యతో నిశ్చితార్థం కూడా జరగ్గా.. వివాహ మహోత్సవం గ్రాండ్‌గా చేసే ప్లాన్‌లో ఉంది మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలో తను కమిట్ అయిన ప్రాజెక్ట్‌లు కూడా పెళ్లి టైమ్‌లోనే రావడంతో డేట్స్ సర్దుబాటు చేయలేక తప్పుకుంది. దీంతో పలు ప్రాజెక్ట్‌ల్లో నిహరికను రీప్లేస్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

అయితే నిహారికకు మామూలుగా ఫ్రెండ్స్ ఎక్కువే. స్నేహితులతో గడపడం అంటే ఇష్టమని చెప్పే నిహారిక.. పలు సందర్భాల్లో ఫ్రెండ్‌షిప్ వాల్యూస్ గురించి కూడా తెలిపింది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌ను పరిచయం చేస్తూ పలు పోస్ట్‌లు కూడా పెట్టింది. పెళ్లి తర్వాత మళ్లీ అంత క్లోజ్‌గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెళ్లింది నిహా. త్వరలోనే పెళ్లి ఉండటంతో అక్కడే గ్రాండ్‌గా బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గోవా టూర్‌కు సంబంధించిన పిక్స్‌ను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందులో వధువు అనే ట్యాగ్‌తో నిహా పిక్స్ స్పెషల్‌గా ఉన్నాయి. తను సింగిల్‌గా ఉన్నప్పుడు చేసుకునే చివరి పార్టీ ఇదే అన్నట్లు పోస్ట్ పెట్టింది మెగా ప్రిన్సెస్.

Next Story

Most Viewed