జమ్మూకాశ్మీర్‎లో 40 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

by  |
Nia
X

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌లోని 14 జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 40 చోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిషేధిత జమాత్-ఇ-ఇస్లామీ సభ్యుల స్థావరాలే లక్ష్యంగా తనిఖీలు చేశారు. కాగా, 2019లోనే ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. ఉగ్రవాదులకు నిధులు చేరవేస్తున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. నిషేధిత సంస్థకు చెందిన సభ్యులు ప్రజల నుంచి చారిటీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి, హింసాత్మక, వేర్పాటువాద సంస్థలకు అందజేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారి తెలిపారు.

ముఖ్యంగా హిజుబ్-ఉల్-ముజాయిద్దీన్, లష్కర్-ఇ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. ఈ నిషేధిత సంస్థ స్థానిక యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. కాగా, ఈ సోదాల్లో ముఖ్యమైన పత్రాలు, కొన్ని ఎలక్ర్టిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఉగ్రసంస్థలకు నిధుల చేరవేస్తున్నారని ఆరుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఉగ్రవాద సంస్థల్లో చేరే యువకులపై ప్రత్యేక దృష్టి పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి భద్రత దళాలను ఆదేశించారు. మరోవైపు ఈ సోదాలకు జమ్మూ కశ్మీర్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది సహాకారం అందించారు.

Next Story

Most Viewed