ఇలా దేశంలో ఎక్కడా లేదంటూ.. తెలంగాణ హెచ్ఆర్సీకి ప్రశంస

by  |
HRC
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల కమిషన్ (న్యూఢిల్లీ) డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంతోష్ మెహ్రా మంగళవారం తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ను సందర్శించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఆర్సీకి వచ్చిన ఆయన ఇక్కడ జరుగుతున్న కేసుల తీర్పు ప్రక్రియను, ముఖ్యంగా కోర్టు వ్యవహారాలను పరిశీలించారు. అలాగే కోర్టు హాళ్లతోపాటు కమిషన్‌లోని అన్ని విభాగాలను కూడా వీక్షించారు. హెచ్ఆర్సీకి వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడారు.

దేశంలోనే కోర్టు విధానాన్ని అనుసరిస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాత్రమే అని పేర్కొన్నారు. తాను ఇక్కడ గమనించిన అంశాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ ముందు ఉంచుతానని చెప్పారు. పబ్లిక్ హియరింగ్ సిస్టమ్ అన్ని రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్‌లలో అందుబాటులో ఉండేలా సిఫారసు చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య, సభ్యులు ఎన్ ఆనందరావు, ఇర్ఫాన్ మొయినుద్దీన్‌తో పాటు కమిషన్ సెక్రటరీ విద్యాధర్ భట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ షహాబుద్దీన్, పౌరసంబంధాల అధికారి పి. శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డీఎస్పీ సత్తయ్యలు.. సంతోష్ మెహ్రాను శాలువాతో ఘనంగా సన్మానించారు.



Next Story

Most Viewed