కవలల ప్రాణం తీసిన ఆక్సిజన్ కొరత

by  |
కవలల ప్రాణం తీసిన ఆక్సిజన్ కొరత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆక్సిజన్ కొరతతో దేశంలో కరోనా పేషెంట్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. కరోనా పేషెంట్లు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులు, ఆపరేషన్లతో ఐసీయూలో ఉన్న పేషెంట్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇటువంటి విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని ఓ మాతా శిశు ఆస్పత్రిలో వెలుగుచూసింది. అప్పుడే కవల పిల్లలకు జన్మనిచ్చిన ఓ తల్లి తన బిడ్డలను కళ్లారా చూద్దామనుకునేలోపే కన్నుమూశారు. శనివారం రాత్రి కవల పిల్లలకు ఆక్సిజన్ అవసరం కావడంతో సమయానికి సిలిండర్లు అందుబాటులో లేకుండాపోయాయి. ఇదే క్రమంలో ప్రాణవాయువు అందక నవజాత శిశువులు మృతి చెందారు.



Next Story

Most Viewed