ఎలాంటి అర్హత లేకుండానే.. గూగుల్ సర్టిఫికేషన్ కోర్సులు

by  |
ఎలాంటి అర్హత లేకుండానే.. గూగుల్ సర్టిఫికేషన్ కోర్సులు
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం పొందాలంటే? కాస్త కష్టమే! బీటెక్‌లో మంచి మార్కులు రావాలి, ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వాలి, అన్ని రౌండ్లు క్లియర్ చేసిన తర్వాత, అప్పుడు పోటీని బట్టి జాబ్ వస్తుంది. అయితే, ఎలాంటి అర్హత లేకుండా కొద్ది రోజుల్లోనే గూగుల్‌లో జాబ్ కొట్టే అవకాశం వస్తే.. సూపర్ కదా! ఇప్పుడు గూగుల్ అదే చేస్తోంది. ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్‌ల కోసం గూగుల్ ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది.

కొవిడ్ సంక్షోభం వల్ల ఉద్యోగాలు సంపాదించడమే కాదు.. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమూ కష్టంగానే ఉంది. అయితే, శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయలు అన్నట్లు.. ఈ పాండమిక్ టైమ్‌లో ఆన్‌లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ 5 భిన్నమైన సర్టిఫికెట్ కోర్సులను డిజైన్ చేసింది. ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలు పొందేందుకు వీలుగా ‘గ్రో విత్ గూగుల్’ అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ కోర్సులు.. నిరుద్యోగులు అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సరైనవని గూగుల్ అభిప్రాయపడింది. మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఆరు నెలల పాటు శిక్షణనిచ్చి పరీక్ష ఆధారంగా సర్టిఫికెట్లను అందజేస్తారు. వీటిని సాధారణ డిగ్రీలుగా పరిగణిస్తామని గూగుల్ పేర్కొంది. ఈ కోర్సులు నేర్చుకున్న తర్వాత గూగుల్‌లోనే ఉద్యోగం పొందవచ్చు లేదా ఇతర సంస్థల్లోనైనా చేరేందుకు గూగుల్ సహాయం చేస్తుంది. కోర్సులు నేర్చుకునేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు.

ఈ కోర్సుల్లో ప్రధానంగా.. కస్టమర్ సర్వీస్, ట్రబుల్ షూటింగ్ టు నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్పిస్తారు. ఎవరైనా ఈ ప్రొగ్రామ్‌కు ఎన్‌రోల్ చేసుకోవచ్చు. 7 రోజుల ఫ్రీ ట్రయల్ ప్రొగ్రామ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. కోర్సు ఫీజు ఒక్కో నెలకు రూ. 3669/-. మొత్తం ఆరు నెలల కోర్సు కాలానికి దాదాపు 22 వేల రూపాయలు ఖర్చవుతాయి.

Next Story