ప్రకటనలు మారాయి.. గమనించారా?

by  |
ప్రకటనలు మారాయి.. గమనించారా?
X

దిశ, వెబ్‌డెస్క్: సీరియళ్లను ఇంగ్లీషులో సోప్ ఒపేరాస్, డైలీ సోప్స్ అని పిలుస్తారు. సబ్బుల ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి కాబట్టి వాటికి ఈ పేరు వచ్చిందంటారు. ఒకప్పుడు టీవీ సీరియళ్లు చూస్తుంటే సబ్బులు, షాంపూల ప్రకటనలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ ప్రకటనలు తక్కువై వేరే ప్రకటనలు పెరిగిపోయాయి. ఇప్పుడు అవి చాలా ఆవశ్యకమైన ఉత్పత్తులు. వాటి అవసరం పెరిగినపుడు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. వినియోగదారుడిని ఆకర్షించాలంటే ఎంతో కొంత వినూత్నంగా ఉండాలి. మరి వినూత్నతను ప్రజలకు పరిచయం చేయాలంటే ప్రకటనలు తప్పనిసరి. అందుకే ఇప్పుడు జీవితంలో ఓ భాగంగా మారిన ఉత్పత్తుల ప్రకటనలు పెరిగిపోయాయి. ఇంతకీ ఆ ఉత్పత్తులు ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.

అవును.. శానిటైజర్‌లు. గతంలో క్రిమిసంహారక ఉత్పత్తులు, క్లీనింగ్ ద్రవాలు తయారుచేసిన కంపెనీలు అన్నీ ఇప్పుడు శానిటైజర్‌లను తయారు చేస్తున్నాయి. కానీ అన్ని శానిటైజర్‌లు ఒకేలా ఉండవు. తేడాలు ఉంటాయి. కొన్నింటిలో నీటి శాతం తక్కువ, ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటాయి. మరికొన్ని ద్రవరూపంలో ఉంటే, ఇంకొన్ని స్ప్రే రూపంలో దొరుకుతాయి. ఇలా అవసరానికి తగినట్లుగా శానిటైజర్లను తయారు చేస్తున్నారు. వీటిని మార్కెట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్న ప్రధాన దారి టీవీ ప్రకటనలు. బయట హోర్డింగ్‌లు పెట్టినా పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి కంపెనీలకు టీవీలే దిక్కయ్యాయి. అందుకే అందరూ ఒకేసారి ఎగబడటంతో ఇప్పుడు టీవీల్లో శానిటైజర్ ప్రకటనలు పెరిగిపోయాయి. ఎంతలా అంటే ప్రతి నాలుగు ప్రకటనల్లో రెండు శానిటైజర్ ఉత్పత్తులే!



Next Story

Most Viewed