జన్-ధన్ అకౌంట్ పై నిర్మలాసీతారామన్ ట్వీట్.. మండి పడుతున్న నెటిజన్స్

by Shamantha N |   ( Updated:2021-08-28 03:25:24.0  )
nirmala-seeta-raman 1
X

దిశ, వెబ్ డెస్క్ : జన్-ధన్ అకౌంట్ల గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ట్వీట్ లో ” జన్-ధన్ ఖాతాల్లో 55% మహిళలు ఉన్నారని, 67% గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం 43.04 కోట్ల జన్-ధన్ ఖాతాల్లో ప్రస్తుతం 36.86 కోట్లు (86%) పనిచేస్తున్నాయి. PMJDY ఖాతాదారులకు మొత్తం 31.23 కోట్ల రూపే కార్డులు ఉన్నాయి” అని పోస్ట్ సారాంశం.

దానిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ” 43 కోట్ల ఖాతాలు X రూ.150 వార్షిక కార్డ్ ఫీజుల ద్వారా =రూ. 6450 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇచ్చారని, ఇతర ఛార్జీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకులను ధనవంతులుగా చేసినందుకు ధన్యవాదాలు, జాతీయం చేయబడిన బ్యాంకులు రాజకీయ పార్టీల వలె మారుతున్నాయి” అని ట్వీట్ చేస్తూ విమర్శించారు.

Advertisement

Next Story