ప్రతిరోజూ 34 మంది విద్యార్థులు ఆత్మహత్య.. కారణం అదేనా..?

by  |
ప్రతిరోజూ 34 మంది విద్యార్థులు ఆత్మహత్య.. కారణం అదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా అద్భుతమైనది. విద్యార్థి దశలో ఎన్నో జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఉంటాయి. కాని చాలా మంది విద్యార్థులు దాన్ని పూర్తిగా అనుభవించకుండానే తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం చదువు వల్ల కలిగే ఒత్తిడి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం అని కొందరు, అనుకున్న మార్కులు రాలేదని మరి కొందరు చనిపోతున్నారు. దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో (NCRB) 2020 సంవత్సర విద్యార్థుల మరణాల రికార్డ్‌ల నివేదికను అందించింది. 2020లో ప్రతిరోజూ 34 మంది భారతీయ విద్యార్థులు ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారని షాకింగ్ నివేదికను బయట పెట్టింది. అంటే సుమారుగా సంవత్సరానికి 12,410 విద్యార్థులు చనిపోతున్నారు అన్న మాట. విద్యార్థులు ఏ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడినా చావు మాత్రం సమస్యకు పరిష్కారం కాదు.



Next Story

Most Viewed