టీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే : నాయిని రాజేందర్ రెడ్డి

by  |
టీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే : నాయిని రాజేందర్ రెడ్డి
X

దిశ, కాలోజీ జంక్షన్ : గల్లీలో లొల్లి.. ఢిల్లీలో దోస్తానా చేస్తూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాకు రాష్టంలోని 19 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల విలువ చేసే భూములను అమ్ముతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల సంపాదనలో భాగమైన రైల్వే, ప్రభత్వరంగ సంస్థలను అంబానీ, అదానీ లాంటి వ్యాపారవేత్తలకు అమ్ముకుంటోందన్నారు.

అంతేకాకుండా దేశంలో ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే వరకు కలసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు మేధావులపై దేశద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల రేట్లను పెంచుతూ పన్నుల రూపంలో వసూలు చేస్తుందన్నారు. ఈనెల 27న తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు అధికార పార్టీలైన భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మినహా అన్నిపార్టీలు, ప్రజాసంఘాలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయన్నారు. సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులతో పాటు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed