దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం ఎవరంటే?

by Dishanational2 |
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం ఎవరంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోనే జనాదరణ పొందిన సీఎంలను అంచనావేయడానికి చేపట్టిన సర్వేలో ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేలో 52.7 శాతం రేటింగ్‌తో నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. 51.3 శాతంతో యోగీ తర్వాతి ప్లేసులో ఉన్నారు. ఇక, ఈ జాబితాలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మూడో స్థానంలో ఉండగా ఆయనకు 48.6శాతం రేటింగ్ నమోదైంది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో, 41.4 శాతం రేటింగ్‌తో త్రిపుర సీఎం డాక్టర్ మాణిక్ సాహా ఐదో ప్లేసులో ఉన్నారు. అయితే మాణిక్ సాహా చేసిన అభివృద్ధిని త్రిపుర ప్రజలు కొనియాడినట్టు సర్వేలో వెల్లడైంది. సాహా నిజాయితీగా అట్టడుగు స్థాయి నుంచి పనిచేస్తారని పలువురు ప్రశంసించినట్టు మూడ్ ఆఫ్ ది నేషన్ తెలిపింది. కాగా, 1946 అక్టోబర్ 16న జన్మించిన నవీన్ పట్నాయక్ బిజూ జనతా దళ్ చీఫ్‌గా ఉన్నారు. అంతేగాక సుమారు రెండు దశాబ్దాల నుంచి ఒడిశా సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed