రైలు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలేంటి?: కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

by Dishanational2 |
రైలు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలేంటి?: కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: రైలు ప్రమాదాలను నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రైల్వేలో ప్రస్తుతం అమలు చేస్తున్న, భవిష్యత్‌లో తీసుకునే రక్షణలకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అటార్నీ జనరల్‌ను కోరింది. ప్రమాదాలను అరికట్టడానికి రైల్వే ప్రమాదాల రక్షణ చర్యలు అవసరమని, అందుకోసం ప్రభుత్వానికి సూచనలు జారీ చేయాలని, తక్షణమే అమలులోకి వచ్చేలా రైల్వేలో ’కవచ్‘ వ్యవస్థను ఏర్పర్చేలా మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ‘కవచ్’ వ్యవస్థను దేశం మొత్తం ప్రవేశపెడితే ఆర్థిక పరమైన సమస్యలు ఏమైనా ఎదురవుతాయా, ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా ఈ డీటేల్స్ అందజేయాలని తెలిపింది. కాగా, ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 293 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా కోర్టు స్పందించడం గమనార్హం.



Next Story

Most Viewed