మోడీ ఊళ్లో 2,800ఏళ్ల నాటి సిటీ.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే !

by Dishanational5 |
మోడీ ఊళ్లో 2,800ఏళ్ల నాటి సిటీ.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే !
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని ప్రధాని మోడీ హోమ్‌టౌన్ అయిన వాద్‌నగర్‌లో పురావస్తుశాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో 2,800ఏళ్ల నాటి పట్టణం బయటపడింది. ఇక్కడ లభించిన ఆధారాల ద్వారా క్రీస్తుపూర్వం 800 సంవత్సరంలోనే వాద్‌నగర్‌లో మావన మనుగడ ఉందని ఏఎస్ఐ, ఐఐటీ ఖరగ్‌పూర్ సహా పలువురు నిపుణులు సంయుక్తంగా కనుగొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని జువాలజీ, జియోఫిజిక్స్ ప్రొఫెసర్ అనింద్య సర్కార్ మంగళవారం మాట్లాడుతూ, వాద్‌నగర్‌లోని పురావస్తు తవ్వకాలపై జరిపిన లోతైన అధ్యయనంలో 3,500 ఏళ్లలో వివిధ రాజ్యాల ఆవిర్భావం, వాటి పతనంతోపాటు మధ్య ఆసియా యోధులు భారత్‌పై జరిపిన వరుస దండయాత్రలు, వాతావరణంలో తీవ్ర మార్పులతో కరువు పరిస్థితులూ ఏర్పడినట్టు తెలుస్తోందని వెల్లడించారు. అలాగే, వాద్‌నగర్‌లో దాదాపు ఐదేళ్లుగా ఏఎస్ఐ బృందం పరిశోధనలు కొనసాగిస్తోందని, గతంలో అత్యంత పురాతన బౌద్ధ ఆలయం సైతం బయటపడిందని తెలిపారు. ఇక తాజాగా బయటపడిన ఈ కట్టడం.. దేశంలోనే అత్యంత పురాతనమైన నగరంగా భావిస్తున్నట్టు చెప్పారు.ఈ ప్రాంతంలో 2,800(క్రీ.పూ 800) ఏళ్ల క్రితం నుంచి నిరంతర మానవ మనుగడ సాగిందని, ఈ క్రమంలోనే మొత్తం ఏడు సాంస్కృతిక పొరలు బయటపడ్డాయని వివరించారు. కాగా, తవ్వకాల్లో బయటపడిన నిర్మాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed