సివిల్స్ ఫలితాల్లో తెలుగుతేజం.. తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు

by Disha Web Desk 17 |
సివిల్స్ ఫలితాల్లో తెలుగుతేజం.. తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 ఏడాదికి సంబంధించి సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ సంవత్సరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి కి మొత్తం 1016 మందిని ఎంపిక చేశారు. వీరిలో జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 347, ఈడ‌బ్ల్యూఎస్‌లో 115, ఓబీసీ 303, ఎస్సీ కేట‌గిరి 165, ఎస్టీ కేట‌గిరి కింద 86 మందిని ఎంపిక చేశారు. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన దోనూరు అన‌న్య రెడ్డి దేశవ్యాప్తంగా మూడో ర్యాంక్ సాధించారు.

అదే మొదటి ర్యాంక్ ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంక్ అనిమేష్ ప్రధాన్‌, నాలుగో ర్యాంక్ పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ సాధించారు. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2023 మే 28న నిర్వహించారు. మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 15, 16, 17, 23, 24, 2023 తేదీల్లో జరపగా, ఇంటర్వ్యూలను జనవరి 2 నుండి ఏప్రిల్ 9, 2024 మధ్య దశల వారీగా నిర్వహించారు.

మూడో ర్యాంక్ సాధించడంపై దోనూరు అన‌న్య రెడ్డి మాట్లాడుతూ, రోజుకు 12 నుంచి 14 గంట‌ల పాటు కష్టపడి చదివాను, ఆంథ్రో పాల‌జీ ఆప్షనల్ స‌బ్జెక్ట్‌గా ఎంచుకున్నాను, ఇలా తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అభ్యర్థులు తమ ఫలితాలను చూడాలనుకుంటే వెబ్‌సైట్ https://upsc.gov.in/లో చూసుకోగలరు.


Next Story

Most Viewed