అయోధ్య రామమందిరంపై రాజస్థాన్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Dishanational6 |
అయోధ్య రామమందిరంపై రాజస్థాన్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రామమందిరంపై నిర్మాణంపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల విషయంలో రామమందిరాన్ని వాడుకోకుండా.. బీజేపీని అడ్డుకునే యత్నం చేశారు. అయోధ్య ఆలయాన్ని నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నా.. రామమందిరాన్ని నిర్మించేదని అన్నారు.

రాజస్థాన్ లో మొత్తం 25 స్థానాలుండగా.. 2014లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019లో 24 సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఈసారి రాజస్థాన్ లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు అందర్నీ షాక్ కు గురిచేస్తాయని అన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

రామమందిరంపై గెహ్లాట్ కామెంట్స్..

ఈసారి 400 సీట్లు గెలుస్తామనే నినాదాలతో ప్రజలను గందరగోళపరిచేందుకు, దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. 2014లో బీజేపీకి 31 శాతం ఓట్లే వచ్చాయని.. అంటే మిగతా ప్రజలందరూ బీజేపీకి వ్యతిరేకిస్తున్నట్లే అర్థం అని అన్నారు. 2019లో బీజేపీకి 38 శాతమే ఓట్లు వచ్చాయన్నారు. కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. తమకు నచ్చిందే బీజేపీ చేస్తుందన్నారు.

వాషింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేశామన్న బీజేపీ.. ఆ మిషన్‌లో ఏం జరుగుతోందో దేశం మొత్తానికి తెలుసునని అన్నారు. బీజేపీ ఎంపీలు రాజస్థాన్‌కు, ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఎంపీలు తప్పిపోయారని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రామ మందిర నిర్మాణంతో ప్రతిపక్షాల కీలక సమస్య ఒకటి ముగిసిపోయిందని బీజేపీ చెప్పడం గురించి స్పందించారు అశోక్ గెహ్లాట్. రామమందిర నిర్మాణం అనేది..అది ఎన్డీఏ హామీ అని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే తాము కూడా అయోధ్య ఆలయాన్ని నిర్మించేవాళ్లమని అన్నారు. ఆలయాన్ని నిర్మించమని సుప్రీంకోర్టు ఆదేశిచిందని గుర్తు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా చర్చ..

బీజేపీ ప్రభుత్వంపై గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం వల్ల దేశప్రతిష్ఠ దెబ్బతిన్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారి అరెస్టు గురించి చర్చ జరుగుతోందన్నారు. అమెరికా, జర్మనీలు ఇప్పటికే వీటి గురించి మాట్లాడాయన్నారు. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేశాయని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి ఎన్నికల ముందు దీని గురించి మాట్లాడిందన్నారు. ఒకవైపు.. 400 సీట్ల గెలుపే అని మాట్లాడుతూ.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.

ఎలక్టరోల్ బాండ్ల వివాదం

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ కంటే ప్రతిపక్షాలే ఎక్కువ డబ్బు సంపాదించిందని మోడీ అనడం ఆశ్చర్యకరం అని అన్నారు గెహ్లాట్. ఇప్పటికే ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రధాని రెండుసార్లు వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. మోడీ ఎప్పుడూ దేనిపైనా మాట్లాడడని.. ఇప్పటివరకు దేనిపైనా స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించిందన్నారు. డబ్బు సంపాదించేందుకు ఈసీని వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.8,500 కోట్లు బీజేపీ ఖాతాలో జమ అయ్యిందని అన్నారు.

పార్టీ యునైటెడ్?

సచిన్ పైలట్ తో విభేదాల గురించి స్పందించారు గెహ్లాట్. పార్టీ ఐక్యంగానే ఉందని అన్నారు. తన కుమారుడు వైభవ్ గెహ్లాట్ జలోర్ సిరోహి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నిధులు లేకున్నా.. తక్కువ వనరులతోనే తమ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు.

ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ జరగనుంది. రాజస్థాన్ లో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 19న రాజస్థాన్ లోని 12 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26 న మిగతా స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.


Next Story