మహారాష్ట్రలో ఠాక్రే పేరుకే ఓట్లు.. రాజ్ ఠాక్రే, అమిత్ షా భేటీపై ఉద్ధవ్ విసుర్లు

by Dishanational6 |
మహారాష్ట్రలో ఠాక్రే పేరుకే ఓట్లు.. రాజ్ ఠాక్రే, అమిత్ షా భేటీపై ఉద్ధవ్ విసుర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఠాక్రే పేరుకే ఓట్లు వస్తాయని బీజేపీ గ్రహించిందని అన్నారు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. అందుకే రాజ్ ఠాక్రేను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాందేడ్ లో జరిగిన సభలో ఉద్ధవ్ ఠాక్రే ప్రసింగించారు. మహారాష్ట్రలో మోడీ పేరుతో ఓట్లు పడవని బీజేపీ బాగా తెలుసని అన్నారు. ఇక్కడి ప్రజలు బాల్ ఠాక్రే పేరుతోనే ఓటేస్తారని గుర్తుచేశారు.

అందుకే బీజేపీ ఇతర పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటుందని విమర్శించారు. తొలుత బాల్ ఠాక్రే ఫొటోను దొంగిలించారని.. శివసేన చీలిక వర్గమైన ఏక్ నాథ్ షిండేను ఉద్దేశించి అన్నారు. ఇవాళ బీజేపీ మరో ఠాక్రేని దొంగిలించేందుకు ప్రయత్నిస్తుందని.. అమిత్ షా, రాజ్ ఠాక్రే మీటింగ్ గురించి ప్రస్తావించారు. ఎవరినైనా మీ పార్టీలో చేర్చుకోండి.. మీ ఓటమికి.. నా ప్రజలను, నేను చాలు అని అన్నారు ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీతో పొత్తు ఉన్నప్పుడే శివసేన ప్రతిష్ఠ పడిపోయిందనన్నారు. కమల దళంతో తెగదెంపులు చేసుకున్నప్పట్నుంచి క్రైస్తవులు, ముస్లింల నుంచి కూడా మద్దతు వస్తుందని.. వారికి తమ హిందుత్వ భావజాలంతో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నట్లు తెలిపారు.

మరోవైపు బీజేపీ, ఎంఎన్ఎస్ మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని సీనియర్ నేత బాలా నంద్ గావ్కర్ అన్నారు. పొత్తులో భాగంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సౌత్ ముంబై, షిరిడీ, నాసిక్ మూడు స్థానాలు కోరుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే 2006లో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే విడిపోయాక.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజకీయంగా ఎదగలేదు. 2008లో 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఒక్క అసెంబ్లీ సీట్ కే పరిమితమైంది రాజ్ ఠాక్రే పార్టీ.



Next Story

Most Viewed